నిప్పు - రివ్యూ
గుణశేఖర్ తీయాలనుకున్న కధ ( నా చిన్న బుర్రకు తట్టినది , నేను అర్ధం చేసుకుని , ఊహించుకున్నది )
రాజా గౌడ్ హైదరాబాదు ను శాసించే ఒక
పెద్ద రౌడీ . అతనికి ఒక భార్య . ఇద్దరు కూతుళ్ళు . పెద్దమ్మాయి దుబాయి లో
ఉద్యోగం చేస్తుంది . చిన్నమ్మాయికి ఒక కాలు అవిటి . భార్య చాల గయ్యాళి .
పెద్దమ్మాయి దుబాయిలో శ్రీరాం అనే వ్యక్తి తో ప్రేమలో పడుతుంది . ఒక
సాయంత్రం ఇద్దరూ ఒక 21 అంతస్తుల భవనం మీద రొమాంటిక్ గా సరదాగా గడుపుతుండగా
ప్రమాదవసాత్తూ ఆ అమ్మాయి పై నుండి పడిపోయి చనిపోతుంది . కానీ ఆ అమ్మాయిది
ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదని , శ్రీరాం ఆ అమ్మాయిని చంపేసాడని దుబాయి
కోర్ట్ నమ్మి , అతనికి ఉరిశిక్ష వేస్తుంది . శ్రీరాం కు ఒక మంచి ఫ్యామిలీ
ఉంది ఇండియా లో . ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీ కు తెలీదు . శ్రీరాం కు ప్రాణ
స్నేహితుడైన సూర్య ( రవితేజ ) స్నేహితుడి పుట్టినరోజు కోసం దుబాయి వెళితే
ఈ విషయం తెలుస్తుంది . మరి శ్రీరాం ను రక్షిచుకోవటం ఎలా అని
ప్రయత్నిస్తున్న సూర్య కు , చనిపోయిన అమ్మాయి తల్లితండ్రులు క్షమాబిక్ష
పత్రం పై సంతకం పెడితే శ్రీరాం శిక్ష రద్దు అవుతుంది అని తెలుస్తుంది . సో
సూర్య ఆ భాద్యతను భుజాల మీద వేసుకుని ఇండియా వస్తాడు ....
అసలు సూర్య ఎవరు అంటే .. శ్రీరాం కు
ఫ్రెండ్ , శ్రీరాం చిన్న చెల్లెలను( దీక్ష సెత్ ) ప్రేమిస్తుంటాడు .
హైదరాబాద్ లో ఒక ఫిట్ నెస్ సెంటర్ నడుపుతుంటాడు . కష్టాల్లో ఉన్న వారిని
తన కండబలంతో, మంచితనంతో ఆదుకుంటూ ఉంటాడు . ఈ క్రమంలో ఒక సారి రాజా గౌడ్ తో
తలపడి , అతని సామ్రాజ్యాన్ని, అతని వ్యాపారాన్ని కూలగొట్టి రాజా గౌడ్ కు
ప్రధాన శత్రువు అవుతాడు . ఇప్పుడు అదే రాజ గౌడ్ దగ్గరకు వెళ్లి తన
స్నేహితుడి ప్రాణాల్ని కాపాడమని అడగాల్సిన పరిస్థితి . కాని రాజ గౌడ్
కోరుకునేది సూర్య చావుని . ఈ పరిస్థుతలను సూర్య ఎలా తట్టుకుని అధిగమించి తన
స్నేహితుడి ప్రాణాలు కాపాడి, తన ప్రేయసిని దక్కించుకున్నాడు అన్నదే కధ
....
కధను చదివారు కదా .. ఈ కధను గుణశేఖర్ ఎలా తెర మీద చూపించాడో ఇప్పుడు చూద్దాం :
సినిమా మొదలైంది ... పేర్లు వేసారు ...
ముగ్గురు పేరుమోసిన రౌడీలు వచ్చి ఒక బిల్దర్ కు మామూలు అడిగారు . కట్
చేస్తే హీరో ఎంట్రీ ... 8 ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయాయి ... 29 సుమో లు
గాల్లోకి లేచిపోయాయి .. దాదాపు 200 మంది కాళ్ళు చేతులు
విరగ్గొట్టుకున్నారు.. హీరో అసలు బండి దిగలేదు .. చొక్కా నలగలేదు ...
క్రాఫ్ చెదరలేదు ... ఫైటు అయిపోగానే హీరో గారు పూర్తిగా తడిగా , నీళ్ళు
నిండి ఉన్న సెల్లార్ల లో బాగా ట్యూబ్ లైట్ లు వెలిగించి .. వాటిమధ్య తన
ప్రతాపాన్ని వర్ణిస్తూ ఒక పాత పాడాడు .. మధ్య మధ్య లో చలి జ్వరం వచినట్లు
వణికిపోతూ డాన్సు చేసాడు ... తరువాత విలన్ వచ్చాడు .. పైల్స్ కు బ్రాండ్
అంబాసిడర్ లాగ అరుస్తూ కాసేపు మాట్లాడాడు .. వెంటనే హీరోయిన్ వచ్చి
బొడ్డును , తొడలను చూపిస్తూ ఎక్సర్ సైజులు చేసింది .. ఆ తర్వాత హీరో
దుబాయ్ వెళ్ళాడు .. పదిరోజుల తరువాత వచ్చాడు .. పెద్ద ఫైటు .. వెంటనే
లండన్ వెళ్లి ఒక పాట పాడాడు. వెనకాతల రష్యన్ అమ్మాయిలు " తుర్ర్ర్రర్
...పుర్ర్ర్ర్ ..గుర్ర్ర్ " అంటూ మధ్య మధ్యలో అరిచారు . హాల్లో నుంచి చాల
మంది జనం బయటకు వెళ్లారు . సమోసా లు బాగా అమ్ముడు పోయాయి బయట . పాట
అయిపొయింది . విలన్ కు మళ్లీ పైల్సు వచ్చాయి . రాజేంద్ర ప్రసాద్ హీరో ను
తిట్టాడు . హీరో ఫైటు చేసాడు .. ఇంటర్వల్ ... నేను బయటకు వచ్చాను ... చాల
మంది ముఖాల్లో స్టాక్ మార్కెట్ లో డబ్బులు పోగుట్టుకున్న ఫీలింగ్
కనిపించింది ( నా భ్రమా ? )
మళ్లీ సినిమా స్టార్ట్ అయింది . హీరో
హీరోయిన్ ను బయటకు తీసుకువెళ్తాను అని చెప్పి బయటకు తీసుకు వచ్చాడు. ఇద్దరూ
పాట మొదలెట్టారు .. హాల్లో జనం లో 85 % బయటకు వెళ్ళిపోయారు .. హీరో పెద్ద
ఫైటు చేసాడు ... ఆ క్రమంలో సూపర్ మాన్, హి మాన్ , spyderman అందరినీ మించే
అధ్బుత సాహసాలు చేసాడు ... కాసేపటకి హీరోయిన్ కు నిజం చెప్పాడు ( ఏంటి అని
నన్ను అడగొద్దు ప్లీజ్ ) .. హీరోయిన్ ఏడుస్తుంది ... నాకు వాంతి
వస్తున్నట్లు ఒక ఫీలింగ్ కలిగింది .. ఈ లోగ బ్రహ్మానందం వచ్చి కామెడీ అన్న
పేరుతో కాసేపు వికారంగా ప్రవర్తించి వెళ్ళిపోయాడు ...( మీరు కొంచం రోజులు
రెస్ట్ తీస్కోండి సార్ ) వెంటనే హీరోయిన్ జాతీయ స్థాయిలో అథ్లెటిక్
చాంపియన్ అయిపొయింది ,, ఆ ఆనంద భాష్పాల మధ్య ఒక పాట పాడుకున్నారు .. హీరో
ఫైటు చేసాడు ... వెంటనే ఫ్యామిలీ సాంగ్ స్టార్ట్ అయింది ... అందులో
328 బొడ్లను, క్లోజ్ అప్ లో చూపించారు . ( భగవంతుడా ).. వెంటనే విలన్
వచ్చి రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు
... విలన్ కు శత్రువు వచ్చి విలన్ మీద ఎటాక్ చేసాడు ... హీరో రాజేంద్ర
ప్రసాద్ ఫ్యామిలీ ను రక్షించి విలన్ ను కూడా కాపాడాడు ... ఈ లోగా హీరో
ఫ్రెండ్ దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చాడు ... విలన్ వచ్చి హీరో ఫ్రెండ్ ను
కిడ్నాప్ చేసాడు ... హీరో వెళ్లి ఫైటు చేసాడు ... విలన్ మారిపోయి అందర్నీ
ఆశీర్వదించాడు ... నాకు గుండెలలో ఎవరో గునపం దించినట్లు అనిపించింది ..
హాల్ నుంచి బయటకు వచ్చాను ... ఇంటికెళ్ళి మిరియాల కషాయం తాగి పడుకున్నాను
... శుభం..
ఇందులో రివ్యూ కావాలని మీకు అనిపిస్తే
పైన చెప్పిన కధను కింద చెప్పిన సీన్లకు అతికించుకుని ఊహించుకోగలరు ...
ఒక్క ముక్కలో చెప్పాలంటే "నిప్పు " ఒక సినిమా కాదు ... ఒక ఆయుధం ...ఒక
శక్తి..
ఒక మందు ..... సర్వరోగ నివారణి.. రెండు
సార్లు ఈ సినిమా ను చూస్తే కరుడుగట్టిన తీవ్ర వాది కూడా నిజాలు చెప్పి ,
లొంగిపోవటం ఖాయం ... దీనిని ఇండియన్ మిలిటరీ సైనికులకు చూపిస్తే ..
ఎటువంటి క్లిష్ట పరిస్థితుల నైన అవలీలగా ఎదుర్కొనే మానసిక సామర్ధ్యం
పెరుగుతుంది ... ఇటువంటి ఆణిముత్యాన్ని అందించిన గుణశేఖర్ కు , నిర్మించిన
చౌదరి కు , స్నేహానికి విలువ నిచ్చి కధ వినకుండా నటించిన రవితేజ కు
తెలుగు సినిమా , తెలుగు జాతి రుణపడి ఉంటుంది ....
**** నా పిచ్చి నాకు ఆనందం అన్న
కాన్సెప్ట్ తో రాసిన ఈ రివ్యూ .. ఎవరిని నొప్పించడానికి కాని , ఎవరిపైనా
ద్వేషం తో కాని రాసినది కాదు అని సవినయంగా మనవిచేసుకుంటున్నాను ...